Electric Train: మేఘాలయలో పరుగులు పెట్టిన తొలి ఎలక్ట్రిక్ రైలు
పూర్తి స్థాయి విద్యుదీకరణ కార్యక్రమంలో భాగంగా మేఘాలయలోని దుధ్నయ్ - మెండిపత్తర్ 22.823 ట్రాక్ కిలోమీటర్ల సింగిల్ లైన్ సెక్షన్, అభయపురి - పంచరత్న 34.59 ట్రాక్ కిలోమీటర్ల డబుల్ లైన్ సెక్షన్‌ను మార్చి 15న ప్రారంభించింది. దీంతో నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే మరో మైలురాయిని దాటింది. ఈ సెక్షన్లలో విద్యుదీకరణ పనులను సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ (CORE) పూర్తి చేసింది. 2030 నాటికి జీరో ఉద్గారాలకు మారే దిశగా భారతీయ రైల్వే వేగంగా పనులు చేయిస్తోంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
మేఘాలయలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక రైల్వే స్టేషన్ మెండిపత్తర్. దీనిని 2014లో అప్పటి ప్రధానమంత్రి ప్రారంభించారు. విద్యుదీకరణ పనులు ప్రారంభించడంతో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు ఇప్పటినుంచి మెండిపత్తర్ నుంచి నడుస్తాయి. రైళ్ల సగటు వేగం పెరుగుతుంది. మరిన్ని ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు ఈ విభాగాల ద్వారా పూర్తి వేగంతో నడుస్తాయి. ఇతర రాష్ట్రాల నుంచి బయలుదేరే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ పార్సిల్, సరుకు రవాణా రైళ్లు ఇప్పుడు నేరుగా మేఘాలయ చేరుకోనున్నాయి. విద్యుదీకరణ వల్ల ఈశాన్య భారతదేశంలో రైళ్ల కదలిక గణనీయంగా పెరుగుతుంది. శిలాజ ఇంధనం నుంచి విద్యుత్‌కు మారడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఈ ప్రాంతంలో రైల్వే వ్యవస్థ సామర్థ్యం కూడా పెరుగుతుంది.