Fish With Heart Of Gold: అత్యంత ఖరీదైన ఘోల్ చేప శాస్త్రీయ నామం?
Sakshi Education
మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలోని ముర్బే గ్రామానికి చెందిన మత్స్యకారుడు చంద్రకాంత్ తారె... ఆగస్టు 28న అరెబియా సముద్రంలో వేటకెళ్లాడు.
వేటలో తన వలకు 157 ‘ఘోల్’ చేపలు చిక్కాయి. వీటన్నింటినీ వేలం వేయగా ఏకంగా రూ.1.33 కోట్ల ధర పలికాయి. ప్రొటోనిబియా డయాకంథస్ శాస్త్రీయ నామంతో పిలిచే ఘోల్ చేపలు ఇండో–పసిఫిక్ ప్రాంతాల్లో జీవిస్తాయి. అత్యంత ఖరీదైన సముద్ర చేప జాతుల్లో ఇదీ ఒకటి. చూడ్డానికి అందంగానూ ఉండే ఈ చేపల్లో ఔషధ గుణాలు చాలా మెండు. సింగపూర్‌లో వైన్ తయారీలోనూ వినియోగిస్తారు. వీటికి ఆగ్నేయాసియా, హాంకాంగ్‌లలో చాలా గిరాకీ ఉంది. వీటికి ‘బంగారు గుండె చేపలు’ అనే పేరు కూడా ఉంది.
Published date : 02 Sep 2021 05:51PM