Skip to main content

Vishwakarma Yojana: ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’కు ఏడాది పూర్తి.. ఈ యోజన అంశాలు ఇవే..

మహారాష్ట్రలోని వార్ధాలో సెప్టెంబ‌ర్ 20వ తేదీ ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’కు ఏడాది పూర్తయిన సంద‌ర్భంగా బహిరంగ సభ జ‌రిగింది.
PM Narendra Modi Speak about Vishwakarma Yojana  celebrating one year of Pradhan Mantri Vishwakarma Yojana

ఈ స‌భ‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ యోజన ప్రాథమిక స్పూర్తి అయిన గౌరవం, సామర్థ్యం, సమృద్ధిని మోదీ అభివర్ణించారు.
 
విశ్వకర్మ యోజనతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అధికంగా లబ్ధి పొందుతున్నారని  మోదీ తెలిపారు. ‘మన వస్త్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏడాది కాలంలో 20 లక్షల మందికిపైగా విశ్వకర్మ యోజనలో చేరారు. 8 లక్షల మంది నైపుణ్య శిక్షణ పొందారు’ అని వెల్లడించారు.

ఈ యోజనలోని పలు అంశాలు..
పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్, ఐడీ కార్డు, నైపుణ్య ఉత్కర్షం, టూల్ కిట్ ప్రోత్సాహకాలు, క్రెడిట్ మద్దతు, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ మద్దతు.

గత సంవత్సరంలో 18 వివిధ సంప్రదాయ నైపుణ్యాలతో 20 లక్షల మందిని అనుసంధానించారు. ఇది 700 జిల్లాలు, 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 5,000 పట్టణ స్థానిక యూనిట్లలో ఉంటుంది.

ఈ యోజన ద్వారా.. ప్రభుత్వం 6 లక్షల విశ్వకర్మలకు ఆధునిక పరికరాలను అందించి ఉత్పత్తి సామర్థ్యాన్ని, ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరుస్తోంది. అలాగే వారికి రూ.15,000 విలువైన ఇ-వోచర్, రూ.3 లక్షల వరకు సురక్షణ లేకుండా రుణాలను అందిస్తోంది.

NPS Vatsalya Scheme: పిల్లల ఆర్థిక భవిష్యత్‌కు కొత్త పథకం ప్రారంభం

Published date : 21 Sep 2024 02:59PM

Photo Stories