Indian Antarctic Bill: ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు2022 ఆమోదం
Sakshi Education
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో 'ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు2022'ను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన తొలి బిల్లు ఇదే. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభ ముందుంచారు. బిల్లుపై స్వల్ప సమయం పాటు జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ.. అంటార్కిటికాలో ఉన్న మన దేశానికి చెందిన రెండు కేంద్రాలు మైత్రి, భారతిలలో ఉండే శాస్త్రవేత్తలకు, వారి పరిశోధనలకు మన చట్టాలు వర్తింపజేసేందుకు ఈ బిల్లును తీసుకువచ్చినట్లు తెలిపారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 06 Aug 2022 05:45PM