Skip to main content

Pench Tiger Reserve: విఖ్యాత పులి కాలర్‌వాలీ ఇక లేదు

Collarwali

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఉన్న పెంచ్‌ టైగర్‌ రిజర్వు (పీటీఆర్‌)కు గర్వకారణంగా నిలిచిన విఖ్యాత పులి ‘కాలర్‌వాలీ’ ఇకలేదు. తన జీవితకాలంలో 29 పిల్లలకు జన్మనిచ్చిన ఈ సూపర్‌ మామ్‌ 17 ఏళ్ల వయసులో జనవరి 15న కన్నుమూసింది. పులి సాధారణ జీవితకాలం 12 ఏళ్లు. కాలర్‌వాలీ దానికి మించి ఐదేళ్లు బతికి వృద్ధాప్య సమస్యలతో మరణించింది. కాలర్‌వాలీ మొత్తం ఎనిమిది కాన్పుల్లో 29 పులి పిల్లలకు జన్మనివ్వగా... ఇందులో 25 బతికాయి. అడవిలో పులుల సంఖ్య గణనకు, వాటి ప్రవర్తనను గమనించేందుకు, జాడను కనిపెట్టేందుకు రేడియో సిగ్నల్స్‌ను పంపే పట్టీలకు పులుల మెడకు కడతారు. 2008లో కట్టిన పట్టీ పనిచేయకపోవడంతో 2010 మరో పట్టీని ‘టి15’గా పిలిచే ఈ పులికి కట్టారు. దాంతో దీనికి కాలర్‌వాలీ అనే పేరొచ్చింది. మధ్యప్రదేశ్‌లో 526 పులులున్నాయి. 2018లో అత్యధిక పులులున్న రాష్ట్రంగా అవతరించిన మధ్యప్రదేశ్‌ భారతదేశపు ‘టైగర్‌ స్టేట్‌’గా గుర్తింపు పొందింది. కాలర్‌వాలీ పెంచ్‌ రిజర్వు పెద్ద ఆకర్షణగా ఉండేది.

చదవండి: ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ యుద్ధనౌక ఎక్కడ సేవలందిస్తోంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
విఖ్యాత పులి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 15
ఎవరు    : కాలర్‌వాలీ
ఎక్కడ    : పెంచ్‌ టైగర్‌ రిజర్వు (పీటీఆర్‌), సియోని జిల్లా, మధ్యప్రదేశ్‌ 
ఎందుకు : వృద్ధాప్య సమస్యలతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Jan 2022 02:23PM

Photo Stories