Skip to main content

Live in Relationship: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు..!

ఇద్దరు వయోజనులు కొన్ని రోజులు కలిసి జీవించి, తాము సహజీవనం చేస్తున్నామని ప్రకటించుకోవడం నిజమైన సహజీవనం(లివ్‌ ఇన్‌ రిలేషన్‌) కిందకు రాదని పంజాబ్, హర్యానా హైకోర్టు అభిప్రాయపడింది.
Leave in Relationship
Leave in Relationship

కలిసి జీవించే కాలం, ఈ కాలంలో ఇరువురు నెరవేర్చిన బాధ్యతలు, ఒకరికొకరు చేసుకున్న సాయం తదితర అనేక అంశాలను బట్టి సహజీవనాన్ని గుర్తించాల్సిఉంటుందని జస్టిస్‌ మనోజ్‌ బజాజ్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్త్రీ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాల‌ని ఒక జంట పెట్టుకున్న అభ్యర్ధనను కొట్టివేసింది. దీంతో పాటు సదరు జంటకు రూ. 25వేల జరిమానా విధించింది.

Published date : 18 Dec 2021 12:23PM

Photo Stories