Solar Power Project: కేరళలో అతి పెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టు
Sakshi Education
టాటా పవర్‌కు చెందిన అనుబంధ సంస్థ టాటా పవర్‌సోలార్ సిస్టమ్స్ దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్‌సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపింది. 101.6 మెగావాట్ల గరిష్ట(ఎండబ్ల్యూపీ) సామర్థ్యంతో కేరళ బ్యాక్‌వాటర్స్‌లో దీన్ని నెలకొల్పినట్లు పేర్కొంది. కాయమ్‌కులమ్‌లో 350 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును స్థాపించినట్లు కంపెనీ వెల్లడించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పంద విభాగంలో.. తొలి ఫ్లోటింగ్ సోలార్ ఫొటో వోల్టాయిక్(ఎఫ్‌ఎస్‌పీవీ) ప్రాజెక్టు ఇదేనని టాటా పవర్ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు(కేఎస్‌ఈబీ) తీసుకుంటుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 04 Jul 2022 07:03PM