Skip to main content

Kerala Police: కేరళ పోలీసులకు యాంటీ డ్రోన్‌ వాహనం

Kerala Police inducts anti-drone vehicle

యాంటీ డ్రోన్‌ వాహనాన్ని సమకూర్చుకుని దేశంలోనే తొలిసారిగా ఈ సదుపాయాన్ని పొందిన వారుగా కేరళ పోలీసులు వినుతికెక్కారు. అంతేకాదు ఈగల్‌ ఐగా వ్యవహరిస్తున్న ఈ వాహనాన్ని ఆ శాఖకే చెందిన డ్రోన్‌ ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.80 లక్షలతో అభివృద్ధి చేయడం విశేషం. దీనిసాయంతో అనుమతిలేకుండా ఎగిరే, దాడికి పాల్పడే డ్రోన్లను కూల్చివేస్తారు. విమానాశ్రయాలు, ప్రముఖులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఈ వాహనాన్ని మోహరిస్తారు. ఇందులోని యాంటీ డ్రోన్‌ వ్యవస్థ అయిదు కిలోమీటర్ల పరిధిలో అనుమతుల్లేకుండా వినియోగించే డ్రోన్లను గుర్తించడంతోపాటు వాటిని కూల్చివేస్తుంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Oct 2022 02:59PM

Photo Stories