Indian Navy: నేవీలో చేరిన ఐఎన్ ఎస్ మోర్ముగావ్
Sakshi Education
![INS Mormugao Commissioned into Indian Navy](/sites/default/files/images/2022/12/30/ins-mormugao-1672399172.jpg)
దేశీయంగా తయారుచేసిన స్టెల్త్‌గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ ఎస్ మోర్ముగావ్‌ను భారత నౌకా దళంలో ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు రక్షణ æశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, గోవా సీఎం ప్రమోద్ సవాంత్ హాజరయ్యారు. ఈ యుద్ధనౌక చేరికతో భారత నేవీ మరింత బలోపేతం అవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఐఎన్‌ఎస్ మోర్ముగావ్‌ను అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధ నౌకగా అభివర్ణించారు. ప్రపంచంలో అధునాతన సాంకేతికత కలిగిన యుద్ధనౌకల్లో ఇది ఒకటి. ఇందులోని వ్యవస్థలు భవిష్యత్తు అవసరాలు తీర్చగలవు. గోవాలో చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్ పేరిట దీనికి ఈ పేరు పెట్టారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 30 Dec 2022 04:49PM