Election of Vice President: ఉప రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా
Sakshi Education
దేశంలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఆగస్టు 6న ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదే రోజున ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. జులై 17నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా పేర్కొంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఉప రాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. 233 మంది రాజ్యసభ సభ్యులతోపాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, 543మంది లోక్‌సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకొని ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 04 Jul 2022 07:13PM