Skip to main content

Indian Railways: తొలిసారిగా అల్యూమినియం గూడ్స్‌రైలు

Indian Railways

అల్యూమినియంతో తయారైన గూడ్స్‌ రైలును రైల్వేశాఖ తొలిసారి భువనేశ్వర్‌ నుంచి నడిపింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు. ఉక్కుతో తయారైన రేక్‌ కంటే ఇది అతి తేలికగా ఉండటంతోపాటు ఎక్కువ సామగ్రిని తరలించేదిగా రూపొందింది. బెస్కో లిమిటెడ్‌ వ్యాగన్‌ డివిజన్‌ ,హిండాల్కో సంయుక్త భాగస్వామ్యంతో తయారైంది. ప్రస్తుతమున్న రేక్‌కన్నా ఇది 180 టన్నుల తక్కువ బరువు ఉంది. అంతే బరువు ఉన్న సామగ్రిని అదనంగా మోసుకెళుతుంది. రేక్‌ బరువు తక్కువగా ఉండటంతో రైలు వేగం పెరగడంతోపాటు నడిపేందుకు విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. రైల్వే శాఖ పర్యావరణ రక్షణ లక్ష్యాలకు అనుగుణంగా కాలుష్య ఉద్గారమూ తగ్గుతుంది.

October Weekly Current Affairs (National) Bitbank: Which state has become the first digitally literate gram panchayat?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Oct 2022 04:50PM

Photo Stories