Indian Navy: నౌకాదళంలో చేరిన ‘వజీర్’
Sakshi Education
![Indian Navy gets 5th Scorpene-class submarine Vagir](/sites/default/files/images/2022/12/30/submarine-vagir-1672398980.jpg)
భారత నావికాదళం అమ్ములపొదిలోకి ఐదో స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గామి ‘వజీర్’ చేరింది. ప్రాజెక్టు–75లో భాగంగా దేశీయంగా నిర్మించిన ఈ సబ్‌మెరైన్ ద్వారా భారత నేవీకి మరింత బలం చేకూరనుంది. వజీర్‌ను ఫ్రాన్స్ నావల్ గ్రూప్ భాగస్వామ్యంతో ముంబైలోని మజగావ్‌డాక్‌షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మరోవైపు మొదటి యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ ‘అర్నాలా’ను చెన్నైలో లాంచ్‌చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన కార్యకలాపాలు పెంచిన నేపథ్యంలో భారత నేవీ తన సామర్థ్యాన్ని పెంచుకొనే పనిలో ఉంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 30 Dec 2022 04:46PM