Skip to main content

Liquid Mirror Telescope: ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్‌ మిర్రర్‌ టెలిస్కోపు

Liquid Mirror Telescope: ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్‌ మిర్రర్‌ టెలిస్కోపు ఎక్కడ ఏర్పాటైంది?
Liquid Mirror Telescope
Liquid Mirror Telescope

దేశంలోనే తొలి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్‌ మిర్రర్‌ టెలిస్కోపు ఉత్తరాఖండ్‌లో ఏర్పాటైంది. ఆర్యభట్ట రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్‌.. నైనిటాల్‌ కొండ ప్రాంతంలోని దేవస్థల్‌ అబ్జర్వేటరీ వద్ద ఈ టెలిస్కోపును ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్‌ లిక్విడ్‌ మిర్రర్‌ టెలిస్కోపుగా(ఐఎల్‌ఎంటీ) పిలుస్తున్న ఈ పరికరం.. ఆస్టరాయిడ్లు, సూపర్‌ నోవాలతోపాటు అంతరిక్ష వ్యర్థాలపై పరిశీలన చేస్తుంది. ఆసియాలో అతిపెద్ద మిర్రర్‌ టెలిస్కోపుగా ఇది నిలవనుంది. ప్రపంచంలో ఇలాంటి టెలిస్కోపులు కొన్ని మాత్రమే ఉన్నాయి. అవన్నీ సైనిక అవసరాలు, లేదా ఉపగ్రహాలపై కన్నేసి ఉంచేందుకు ఏర్పాటు చేశారు. ఖగోళ పరిశోధనల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన లిక్విడ్‌ మిర్రర్‌ టెలిస్కోపు ఇదే కావడం విశేషం. హిమాలయాల్లో 2,450 మీటర్ల ఎతై ్తన ప్రాంతంలో లిక్విడ్‌ టెలిస్కోపును ఏర్పాటు చేశారు. ఈ టెలిస్కోపును ఉపయోగించి అక్టోబర్‌ నుంచి శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ మెకానికల్‌ అండ్‌ ఆప్టికల్‌ సిస్టమ్స్‌ కార్పొరేషన్, బెల్జియంకు చెందిన సెంటర్‌స్పేషియల్‌ డి లీజ్‌ సంస్థలు కలిసి ఈ టెలిస్కోపును డిజైన్‌ చేశాయి. కెనడా, బెల్జియం దేశాలు దీని ఏర్పాటుకు అవసరమైన నిధులు సమకూర్చాయి. టెలిస్కోపు నిర్వహణ బాధ్యతలను భారత్‌ చూసుకుంటుంది.
 

GK National Quiz: ఏ రాష్ట్రానికి చెందిన జిల్లా ప్రతి గ్రామంలో గ్రంథాలయాన్ని కలిగి ఉన్న మొదటి జిల్లాగా అవతరించింది?

Sakshi Education Mobile App
Published date : 14 Jun 2022 07:40PM

Photo Stories