Independence Day celebration: ఎరక్రోట సాక్షిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మక ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. వచ్చే 25ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలన్నారు. అవి.. 1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి; 2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయాలి; 3. మన దేశ చరిత్ర, సంస్కృతిని చూసి గర్వ పడాలి; 4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి; 5.ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి.
Independence Day: తొలిసారి మేడిన్ ఇండియా 'గన్‌సెల్యూట్'
76వ స్వాతంత్య్ర దినోత్సవం మరో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆగస్టు 15న ఎరక్రోట వద్ద గౌరవ వందనం కోసం మేడ్‌ఇన్‌ఇండియా తుపాకీని తొలిసారి ఉపయోగించారు. ఇప్పటి వరకు సెర్మోనియల్ సెల్యూట్ కోసం బ్రిటీష్ తుపాకులను ఉపయోగించేవారు. స్వదేశీ అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ 'హోవిట్జర్ గన్ 'ను కేంద్రం ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)రూపొందించింది. ఈ గన్‌తోనే స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎరక్రోట వద్ద త్రివర్ణ పతాకానికి 21షాట్‌ల గౌరవ వందనం లభించింది. అంతేకాకుండా ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తొలిసారిగా ఎంఐ17 హెలికాప్టర్లు ఎరక్రోటపై పూలవర్షం కురిపించాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP