Skip to main content

Assembly Elections: హిమాచల్‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్‌కి 40, బీజేపీకి 25 స్థానాలు

హిమాచల్‌ ప్రదేశ్‌లో పాత సంప్రదాయమే పునరావృతమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడం 1985 నుంచి ఒక ఆనవాయితీగా వస్తోంది.

ఈసారి కూడా అదే జరిగింది. అధికార బీజేపీ పరాజయం పాలయ్యింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ అధికార పీఠం దక్కించుకుంది. రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40, బీజేపీ 25 సీట్లు కైవసం చేసుకున్నాయి. ముగ్గురు స్వతంత్ర సభ్యులు నెగ్గారు. 67 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కనీసం ఖాతా తెరవలేక చతికిలపడింది. బీజేపీకి చెందిన 8 మంది మంత్రులు ఓడిపోయారు. కాంగ్రెస్‌ స్పష్టమైన మెజార్టీ సాధించింది. గుజరాత్‌లో ఘోర పరాభవం నేపథ్యంలో హిమాచల్‌లో ఈ విజయం హస్తం పారీ్టకి భారీ ఊరటనిచ్చింది.  

Supreme Court: సుప్రీంకోర్టులో మరోసారి మహిళా ధర్మాసనం
ఆమ్ ఆద్మీకి 1.10 శాతం ఓట్లు  
హిమాచల్‌లో బీజేపీ ఇచ్చిన ‘రాజ్‌ నహీ.. రివాజ్‌ బద్లేగా’ నినాదం పెద్దగా పనిచేయలేదు. ప్రభుత్వాన్ని కాదు, సంప్రదాయాన్ని మార్చాలని బీజేపీ చెప్పిన మాటలను జనం పట్టించుకోలేదని ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 43.9 శాతం ఓట్లు సాధించగా, బీజేపీ 43 శాతం ఓట్లు సాధించింది. రెండు పార్టీల నడుమ ఓట్ల తేడా ఒక శాతం కంటే తక్కువే కావడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాదాపు 12 సీట్లలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్లలో తేడా 1,000 లోపే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి జైరామ్‌ ఠాకూర్‌ సెరాజ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చేత్‌రామ్‌పై 38,183 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కేవలం 1.10 శాతం ఓట్లు లభించాయి. 11 సీట్లలో పోటీకి దిగిన సీపీఎంకు 0.66 శాతం ఓట్లు దక్కాయి. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థులు 10.39 శాతం ఓట్లు సాధించారు.

➤ అమరావతి రాజధాని కేసులో.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Published date : 09 Dec 2022 04:05PM

Photo Stories