Skip to main content

Bombay High Court: ఫ‌లించిన 80 ఏళ్ల పోరాటం.. 93 ఏళ్ల బామ్మకు ఆమె ఆస్తి అప్ప‌గింత‌!

బ్రిటన్ పాలకుల నాటి ఒక ఆస్తి వివాదం ఎట్టకేలకు బాంబే హైకోర్టులో పరిష్కారమైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 ఏళ్ల పాటు బాధిత కుటుంబం చేసిన పోరాటం ఫలించింది.
Bombay High Court

93 ఏళ్ల వృద్ధురాలికి వారసత్వంగా వచ్చే ఆస్తిని అప్పగించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ ముంబైలోని రుబీ మాన్షన్ భవనంలో ఉన్న రెండు ఫ్లాట్స్ (ఒకటి 500 చదరపు అడుగులు, మరొకటి 600 చదరపు అడుగులు) 93 ఏళ్ల బామ్మ అలిస్ డిసౌజాకు అప్పగించాలంటూ జస్టిస్ ఆర్ డి ధనూకా, ఎం ఎం సతాయేలతో కూడిన హైకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)
అసలేం జరిగిందంటే..? 
దక్షిణ ముంబైలోని రుబీ మాన్షన్ భవనాన్ని 1942 మార్చి 28న నాటి బ్రిటన్ పాలకులు ప్రైవేటు ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే హక్కుని కల్పించే ఆ నాటి డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం కింద స్వాధీనం చేసుకున్నారు. దీంతో డిసౌజా తండ్రి మొదటి అంతస్తులో తనకున్న రెండు ఫ్లాట్స్ను కోల్పోయారు. సివిల్ సర్వీసెస్లో పని చేసే డి.ఎస్. లాడ్ అనే ప్రభుత్వ అధికారికి తెల్లదొరలు ఆ ఫ్లాట్స్ కేటాయించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1946 జులైలో  ప్రైవేటు ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే ఆదేశాలను భారత ప్రభుత్వం ఎత్తివేసింది. రుబీ మాన్షన్లో ఉన్న ఫ్లాట్లను ఆయా యజమానులకు అప్పగించే ప్రక్రియ చేపట్టింది. అప్పటికే డిసౌజాకు చెందిన ఫ్లాట్లో నివాసం ఉంటున్న లాడ్ కుటుంబం దానిని ఖాళీ చేయలేదు. డిసౌజా తండ్రి కలెక్టర్ని అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయింది.
అప్పుడు మొదలైన వివాదం ఆ తర్వాత పిల్లల మధ్య కూడా కొనసాగింది. 2010లో కంట్రోలర్ ఆఫ్ అకామడేషన్ ఆ ఫ్లాట్స్‌లో ఉంటున్న లాడ్ కుమారుడు, కుమార్తెల్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. అయినా వాటిని ఖాళీ చేయకుండా లాడ్ పిల్లలు 2012లో హైకోర్టుని ఆశ్రయించారు. ఆ ఫ్లాట్స్‌ను వెంటనే యజమాని డిసౌజాకు అప్పగించాలని హైకోర్టు కూడా ఆదేశించింది. అయినా ఆ తీర్పుని వారు లెక్కచేయలేదు. మళ్లీ డిసౌజా కోర్టుకెక్కితే ఆ ఫ్లాట్స్ ఖాళీ చేయించి ఇచ్చే బాధ్యతని మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Lithium Reserves: రాజస్తాన్‌లో భారీగా లిథియం నిల్వలు.. దేశ అవసరాల్లో 80 శాతం అవసరాలను ఇవే తీర్చగలవు!
 

Published date : 09 May 2023 11:23AM

Photo Stories