Skip to main content

Superfast Railway Line: సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్లకు పచ్చ జెండా..

తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు బీజం పడింది. ఇరు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్‌ ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.
Superfast Railway Line

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం – విజయవాడ – తెలంగాణలోని శంషాబాద్‌ మధ్య మొదటిది,  విశాఖపట్నం – విజయవాడ – కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్‌ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్‌ ఫాస్ట్‌ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్‌ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 కేఎంపీహెచ్‌ వేగంతో ప్రయాణించేలా) రైల్వే లైన్‌ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు.

ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. ఈ సూపర్‌­ఫాస్ట్‌ రైల్వేలైన్‌ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్‌ ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది.

Vande Bharat Express: ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం
 

Published date : 03 Jun 2023 11:25AM

Photo Stories