Venkaiah Naidu: ఎస్‌ఏసీఆర్‌ఈడీ పోర్టల్‌ను రూపొందించిన మంత్రిత్వ శాఖ?
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోధికుల దినోత్సవం(అక్టోబర్ 1) సందర్భంగా అక్టోబర్ 1న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన ‘వయోశ్రేష్ఠ సమ్మాన్ – 2021’ అవార్డుల ప్రదానోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో వయోధికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు.. స్టార్టప్‌లు వినూత్నమైన విధానాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని వెంకయ్య సూచించారు.
ఎస్‌ఏసీఆర్‌ఈడీ పోర్టల్ ఆవిష్కరణ...
వయోధికులకు ప్రైవేటు రంగంలో ఉపాధికల్పించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ రూపొందించిన ఎస్‌ఏసీఆర్‌ఈడీ (సీనియర్ ఏబుల్ సిటిజెన్స్ ఫర్ రీ–ఎంప్లాయ్‌మెంట్ ఇన్ డిగ్నిటీ) పోర్టల్‌ను, సేజ్ (సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్) పోర్టల్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రారంభించారు.
షహీన్ తుపాను ఏ సముద్రంలో ఏర్పడింది?
అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాను క్రమంగా బలపడుతోంది. ఏడు రాష్ట్రాల్లో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ అక్టోబర్ 1న హెచ్చరించింది. గుజరాత్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
చదవండి: అర్బన్ 2.0, అమృత్ 2.0 పథకాలు ప్రారంభం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్‌ఏసీఆర్‌ఈడీ (సీనియర్ ఏబుల్ సిటిజెన్స్ ఫర్ రీ–ఎంప్లాయ్‌మెంట్ ఇన్ డిగ్నిటీ) పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : విజ్ఞాన్ భవన్, ఢిల్లీ
ఎందుకు : వయోధికులకు ప్రైవేటు రంగంలో ఉపాధికల్పించేందుకు...