Skip to main content

Niti Aayog : ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ 2021–22’ లో షిమ్లా అగ్రస్థానం

ఆర్థిక వ్యవస్థకు ఇంజన్ల వంటి పట్టణాల తాజా స్థితిగతులను విశ్లేషించి సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌(ఎస్‌డీజీ) అర్బన్‌ ఇండియా ఇండెక్స్‌ పేరిట నీతి ఆయోగ్‌ తొలిసారిగా ఒక జాబితాను ప్రకటించింది.
Niti Aayog
Niti Aayog

ఈ ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ 2021–22’లో షిమ్లా అగ్రస్థానంలో నిల్చింది. తర్వాత వరసగా కోయంబత్తూరు, చండీగఢ్, తిరువనంతపురం, కోచి, పణజి, పుణె, తిరుచిరాపల్లి, అహ్మదాబాద్, నాగ్‌పూర్‌లు తొలి పదిస్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. ధన్‌బాద్, మీరట్, ఈటానగర్, గువాహటి, పట్నా, జోధ్‌పూర్, కోహిమా, ఆగ్రా, కోల్‌కతా, ఫరీదాబాద్‌లు అట్టడుగున నిలిచాయి. మొత్తంగా జాబితాలో ఉన్న 56 పట్టణాల్లో 44 పట్టణాలు పది లక్షలకుపైగా జనాభా ఉన్నవే. 10 లక్షలలోపు జనాభా ఉన్న 12 రాష్ట్ర రాజధానులూ జాబితాలో చోటు సాధించాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు 2030 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలు, లోటుపాట్లు, వ్యవస్థపై అజమాయిషీ, జవాబుదారీతనం తదితరాలను పరిగణనలోకి తీసుకుని జాబితాను రూపొందించారు.

Published date : 25 Nov 2021 03:08PM

Photo Stories