Skip to main content

Double-Decker Trains: అందుబాటులోకి రానున్న డ‌బుల్ డెక్క‌ర్ రైళ్లు

కొంత కాలం ముందు ప్రారంభించిన డ‌బుల్ డెక్క‌ర్ రైళ్లు, ప్ర‌యాణికుల‌కు సౌక‌ర్యాల‌ను అందించ‌డంలో విఫ‌లం అవ్వండంతో, వాటిని ర‌ద్దు చేసింది రైల్వే శాఖ‌. ఇటీవ‌లే ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన విధంగా ప్ర‌యాణికుల‌కు అన్ని స‌ర్దుబాట్ల‌తో కూడిన రైళ్ల‌ను త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఈ రైళ్ల వార్తను పూర్తిగా తెలుసుకుందాం.
Railway department announces modifying double decker trains, Railway Department announcement
Railway department announces modifying double decker trains

సాక్షి, హైదరాబాద్‌: ఇప్ప‌టికే ఎంతో కాలంగా న‌డుస్తున్న రైళ్లకు ప్ర‌యాణ స‌మ‌యం ఎక్కువ‌గా ఉండ‌డం, కొన్ని రైళ్ల‌ల్లో స‌దుపాయాలు, సౌక‌ర్యాలు అందుబాటులో ఉండ‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్ర‌యాణ స‌మ‌యం త‌గ్గించే ప‌రిదిలో, జ‌న‌వ‌రిలో వందేభారత్‌ రైళ్లను ప్ర‌ధాన మంత్రిచే ప్రారంభించారు. వందేభార‌త్ ఎక్స‌ప్రెస్ రైళ్ల సౌక‌ర్యాలు, దాని వేగం ప్ర‌యాణికుల‌కు సుల‌భంగా ఉండ‌డంతో అది సక్సెస్ అయ్యింది.

ఇక‌పోతే, వందేభార‌త్ కి ముందే నిరాశ చూపిన‌ డబుల్‌ డెక్కర్‌ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించి, ఈ డ‌బుల్ డెక్క‌ర్ రైళ్ల‌ను కూడా కావ‌ల్సిన స‌దుపాయాల‌తో తీర్చిదిద్ది ఆ రైళ్ల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది వందే భార‌త్ రైళ్ల‌లో అందే ప్ర‌యాణ సౌక‌ర్యాల్ని ఈ రైళ్లు కూడా అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఆక్యుపెన్సీ రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడుతూ వస్తున్న డబుల్‌ డెక్కర్‌ రైళ్లను మళ్లీ పట్టాలెక్కించి విజయవంతం చేయాలని భావిస్తోంది.

vande bharath

Aditya L1 begins its Journey to the Sun: సూర్యుడి దిశగా ప్రయాణం మొద‌లు పెట్టిన ఆదిత్య ఎల్-1

బెర్తులు ప్రవేశపెట్టి..

డబుల్‌ డెక్కర్‌ రైళ్లు కేవలం పగటి వేళ మాత్రమే తిరిగేలా రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో వాటిల్లో కేవలం చైర్‌ కార్‌ మాత్రమే ఉండేది. సాధారణ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగంతోనే వాటిని నడిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి నడిచే సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లకు దాదాపు 11 గంటల ప్రయాణ సమయం పడుతోంది. రాత్రి వేళ కావటంతో సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లలో ప్రయాణి­కులు పడుకుని ప్రయాణిస్తుండటంతో వారి­కి పగటి సమయం వృథా కావటం లేదు. కానీ, డబుల్‌ డెక్కర్‌ రైళ్లలో పగటి వేళ అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అవుతోంది.

డబుల్‌ డెక్కర్‌ రైళ్లు ప్రారంభమైన కొత్తలోనే సికింద్రాబాద్‌–తిరుపతి, సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య ప్రవేశపె­ట్టారు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే వారు పగటి సమయం మొత్తం రైళ్లలోనే గడపటంతో ఒక రోజు మొత్తం వృథా అయినట్టుగా భావించేవారు. అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అవ్వ‌డంతోపాటు, రైళ్లలో ప్ర‌యాణించేది చైర్ కార్ సీట్ల‌పై కాబ‌ట్టి, మొత్తం 11 గంట‌ల వ‌ర‌కు ప్ర‌యాణికులు అదే సీట్ల‌ల్లో కూర్చోవ‌డం కూడా ఇబ్బందే. వృద్ధులు, ఆరోగ్య స‌మ‌స్య‌లు కలిగిన వారు ఈ సీట్ల‌లో 11 గంట‌లు అలాగే ప్ర‌యాణం చేయ‌లేరు.. ఫలితంగా వాటిల్లో ఆక్యు­పెన్సీ రేషియో వారం రోజుల్లోనే 14 శాతానికి చేరింది.

double decker

ఈ రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డానికి ప్ర‌జ‌లకు స‌మ‌యం వృథా కావ‌డం, వారంతా ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డంతో, ఆ రెండు సర్వీసులను రైల్వే శాఖ‌ రద్దు చేసింది. ఇటీవలే వందేభారత్‌ రైళ్లు పట్టాలెక్కి, అదే పగటి వేళ పరుగు పెడుతున్నా కిక్కిరిసిపోతు­న్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 120 శాతంగా ఉంటోంది. వీటి వేగం ఎక్కువ కావటంతో, తక్కువ సమ­యంలోనే గమ్యం చేరుతున్నాయి. కానీ, వందేభా­రత్‌ తరహాలో అన్ని మార్గాల్లో డబుల్‌ డెక్క­ర్‌ రైళ్ల వేగాన్ని పెంచటం సాధ్యం కాదు. దీంతో వాటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి రాత్రి వేళ తిప్పే యోచనల్లో రైల్వే శాఖ‌ ఉంది.

 Chandrayaan-3: జయహో భారత్‌... చంద్ర‌య‌న్‌-3 ప్ర‌యోగం సూప‌ర్ స‌క్సెస్‌

ప్రయాణికులతోపాటు సరుకులు కూడా..

ప్ర‌యాణికులకు, వారి స‌రుకుల‌తో ఇబ్బందులు క‌లుగ‌కుండా వాటికోసం కూడా ఈ ఏర్పాట్ల‌ను చేసారు. 
ఇక‌పై, పైడెక్‌లో ప్రయా­ణి­కులు, దిగువ డెక్‌లో సరు­కు­లను ఏకకాలంలో తర­లించే ప్యాసింజర్‌ కమ్‌ గూడ్స్‌ నమూ­నాలో కూడా డబుల్‌ డెక్కర్‌ రైళ్లను ప్రవేశ­పెట్టాలని రైల్వే భావిస్తోందని సమా­చారం. దీనికి సంబంధించి డిజైన్‌లను రైల్వే అనుబంధం సంస్థ ఆర్‌డీఎస్‌ఓ పరిశీ­లిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. వెరసి డబుల్‌ డెక్కర్‌ రైళ్లకు మళ్లీ డిమాండ్‌ కల్పించాలని రైల్వే భావిస్తోంది. 
 

Published date : 22 Sep 2023 01:11PM

Photo Stories