Sex workers ను గౌరవించండి: పోలీసులకు సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: ‘‘సెక్స్ వర్కర్లూ అందరిలాంటి మనుషులే. వారికి తగిన గౌరవమివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై వేధింపులకు పాల్పడరాదు’’ అని పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. మనుషుల మర్యాదకు కనీస భద్రత కల్పించడం బాధ్యతగా గుర్తించాలని పేర్కొంది.
సెక్స్ వర్కర్లను వ్యభిచార కూపం నుంచి రక్షించినప్పుడు సంబంధిత ఫోటోలను, వారి గుర్తింపును బయటపెట్టరాదని ప్రసార మాధ్యమాలకు హితవు పలికింది. సెక్స్ వర్కర్లకు గౌరవం, భద్రత కల్పించడానికి చట్టమేదీ లేదు. దాంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఈ మేరకు పోలీసులకు, మీడియాకు ఆదేశాలిచ్చింది.
GK Important Dates Quiz: సేవ్ ది ఎలిఫెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
సెక్స్‌వర్కర్లపై వేధింపులపై 2016లో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గావై, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టు ప్యానెల్ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.