Skip to main content

DY Chandrachud: ‘సహజీవనం’ పిల్‌ కొట్టివేత

సహజీవన బంధాన్ని ‘గుర్తించి’ కేంద్రం తగు మార్గదర్శకాలను రూపొందించాలంటూ దాఖలైన పిల్‌ను మార్చి 20న‌ సుప్రీంకోర్టు కొట్టేసింది.
 Supreme Court

‘‘ఇదో తెలివితక్కువ వ్యాజ్యం. వాటిని రిజిస్టర్‌ చేసి కేంద్రం మాత్రం ఏం చేస్తుంది?’’ అంటూ పిటిషనర్‌కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తలంటారు. బాల్య వివాహాల చట్టం, రజస్వల అయిన బాలికకు పెళ్లిని అనుమతిస్తున్న ముస్లిం చట్టాల మధ్య ఘర్షణ తలెత్తితే ఏం చేయాలన్న అంశాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)


ఏమిటీ సీల్డ్‌ కవర్‌ సంస్కృతి?
మాజీ సైనికోద్యోగుల వన్‌ ర్యాంక్, వన్‌ పెన్షన్‌ (ఓఆర్‌ఓపీ) తాలూకు రూ.28,000 కోట్ల బకాయిలను వచ్చే ఫిబ్రవరికల్లా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై గతేడాది తామిచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు పి.ఎస్‌.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం స్పష్టం చేసింది. ఓఆర్‌ఓపీ బకాయిలపై భారీ మాజీ సైనికోద్యోగుల ఉద్యమం (ఐఈఎస్‌ఎం) పిటిషన్‌పై మార్చి 20న‌ ధర్మాసనం విచారణ జరిపింది.
బకాయిల చెల్లింపునకు కాలావధిని ఖరారు చేసింది. దీనిపై కేంద్రం సీల్డ్‌ కవర్లో సమర్పించిన నోట్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ సంస్కృతి సముచిత న్యాయ ప్రక్రియకు విరుద్ధమని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి తెర పడాలన్నారు. ‘‘వ్యక్తిగతంగా కూడా సీల్డ్‌ కవర్లకు నేను వ్యతిరేకిని. కోర్టులో పారదర్శకత చాలా ముఖ్యం. అంతిమంగా ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. అందులో రహస్యమేముంటుంది?’’ అని ప్రశ్నించారు.

Same Sex Marriage: స్వలింగ వివాహాలు చట్ట విరుద్ధమే!

Published date : 21 Mar 2023 05:13PM

Photo Stories