Edible Oil: కేంద్రం కీలక నిర్ణయం.. వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు
Sakshi Education
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వంట నూనెల ధరలను తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ నూనెలపై ఉన్న దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ జూన్ 15న ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీయ విపణిలో వంటనూనెల ధరలను తగ్గించేందుకు గతంలో తీసుకున్న చర్యలకు ఈ నిర్ణయం తోడ్పడనుందని శాఖ వెల్లడించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని చివరిసారిగా 2021 అక్టోబర్‌లో 32.5% నుంచి 17.5%కి తగ్గించింది.
Wheat To Check Prices: గోధుమ నిల్వలపై పరిమితులు విధించిన కేంద్రం
Published date : 16 Jun 2023 11:33AM