Operation Garuda: డ్రగ్స్ అక్రమ రవాణాపై 'ఆపరేషన్ గరుడ'
Sakshi Education
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సీబీఐ 'ఆపరేషన్ గరుడ' పేరిట దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఎన్సీబీ, ఇంటర్‌పోల్‌తోపాటు పలు రాష్ట్రాల్లోని పోలీసుల సమన్వయంతో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై దాడులు కొనసాగించింది. ఈ సందర్భంగా భారీగా మాదకద్రవ్యాల్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి డ్రగ్స్‌వ్యాపారులను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలను విచ్ఛిన్నం చేయడంతోపాటు డ్రగ్స్‌అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఈ'ఆపరేషన్ గరుడ' ని చేపట్టినట్టు సీబీఐ పేర్కొంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 14 Oct 2022 04:30PM