Skip to main content

Cairn Oil & Gas: దుర్గా చమురు నిక్షేపాన్ని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?

Cairn

రాజస్తాన్‌ రాష్ట్రం, బార్మేర్‌ జిల్లాలోని క్షేత్రంలో చమురు నిక్షేపాన్ని కనుగొన్నట్లు వేదాంత గ్రూప్‌ సంస్థ కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ వెల్లడించింది. డబ్ల్యూఎం–బేసల్‌ డీడీ ఫ్యాన్‌–1 అన్వేషణ బావిలో ఇది బయటపడిందని ఫిబ్రవరి 21న తెలియజేసింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌)కి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. ఈ చమురు నిక్షేపానికి ’దుర్గా’ అని పేరు పెట్టినట్లు వివరించింది. ఆర్‌జే–ఓఎన్‌హెచ్‌పీ–2017/1 బ్లాక్‌లో బావిని 2615 మీటర్ల లోతు వరకు తవ్వినట్లు పేర్కొంది. ఈ క్షేత్రానికి పొరుగునే ఉన్న బ్లాక్‌ నుంచి కెయిర్న్‌ సంస్థ రోజుకు 1,50,000 బ్యారెళ్లకు పైగా చమురు, గ్యాస్‌ ఉత్పత్తి చేస్తోంది.

కోర్బెవాక్స్‌ అత్యవసర వినియోగానికి అనుమతి

దేశీయ ఫార్మా సంస్థ బయోలాజికల్‌–ఈ 12–18 ఏళ్ల గ్రూపు వారి కోసం రూపొందించిన కరోనా టీకా ‘‘కోర్బెవాక్స్‌’’ అత్యవసర వినియోగానికి డీసీజీఐ (డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతులు మంజూరు చేసింది. కోర్బెవాక్స్‌ను పరిమితులతో వినియోగించేందుకు బయోలాజికల్‌–ఈకి అనుమతి లభించినట్లు ఫిబ్రవరి 21న అధికారవర్గాలు వెల్లడించాయి.

చ‌ద‌వండి: బీఐఎం పథకాన్ని ఎప్పటి వరకు కొనసాగించనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దుర్గా చమురు నిక్షేపాన్ని కనుగొన్న సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు    : వేదాంత గ్రూప్‌ సంస్థ కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌
ఎక్కడ    : బార్మేర్‌ జిల్లా, రాజస్తాన్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Feb 2022 03:07PM

Photo Stories