ASI: బరాబర్, నాగార్జునుడి గుహలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం యత్నాలు
బిహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో ఉన్న బరాబర్, నాగార్జునుడి గుహలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వాటిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదించాలని భారత పురావస్తు శాఖ (ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) నిర్ణయించింది. మన దేశంలో మనుగడలో ఉన్న పురాతనమైన తొలచిన రాతి గుహలు ఇవి. మౌర్యుల కాలం(321 బీసీ నుంచి 185బీసీ మధ్య) నాటివిగా పేర్కొంటున్నారు. మఖ్దంపుర్ ప్రాంతంలో బరాబర్ కొండలు నాలుగు గుహల సముదాయాన్ని కలిగి ఉన్నాయి. వాటినే బరాబర్ లేదా లోమస్ రుషి, సుధామ, విశ్వకర్మ, కరణ్ చౌపర్ గుహలుగా పేర్కొంటారు. వీటికి రెండు కిలోమీటర్ల దూరంలో గల నాగార్జునుడి కొండల్లో మూడు చెక్కిన గుహలు ఉన్నాయి. వీటిని కూడా మౌర్యుల కాలం నాటివిగా గుర్తించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP