Skip to main content

AI Anchors: రైతుల కోసం ప్ర‌త్యేకంగా ప్రారంభించిన చానెల్‌లో ఏఐ యాంకర్లు..

Artificial Intelligence Anchors in Doordarshan channel  Celebrating nine years of DD Kisan with AI Krish and AI Bhumi.

రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక చానల్‌ డీడీ కిసాన్‌.. మే 26తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దూరదర్శన్‌ ఐఏ క్రిష్, ఏఐ భూమి పేరిట కృత్రిమ మేధ యాంకర్లను ప్రవేశ పెట్టింది. దీనిద్వారా దేశంలో ఏఐ యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ చానల్‌గా ఇది నిలిచింది. ఈ యాంకర్లు ఏఐ అనుసంధాన కంప్యూటర్లు. ఇవి మనుషుల్లానే పని చేస్తాయి. 365 రోజులు 24 గంటలు నిరంతరాయంగా వార్తలు చదువుతాయి. అన్ని రాష్ట్రాల రైతులు వీటిని వీక్షించొచ్చు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిశోధనల దగ్గర నుంచి మార్కెట్లలో ధరలు, వాతావరణ అంశాలు, ప్రభుత్వ పథకాలు సహా ప్రతి సమాచారాన్ని అందజేస్తాయి. ఇవి ఏకంగా 50 భాషల్లో మాట్లాడగలవు.

Artificial Intelligence: ఈ రాష్ట్రంలోని పాఠశాలల్లో పాఠ్యాంశంగా ‘కృత్రిమ మేధస్సు’!

Published date : 05 Jun 2024 05:43PM

Photo Stories