Vijay Diwas: ఘనంగా విజయ్ దివస్ వేడుకలు
Sakshi Education
ఢిల్లీలోని ఆర్మీ హౌస్‌లో 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌పై భారతదేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ విజయ్ దివస్ పేరుతో డిసెంబర్16న విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యవేక్షణలో జరిగాయి. ఎట్ హోమ్‌పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సైనికాధికారులు పాల్గొన్నారు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత దేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివస్ పేరుతో వేడుకలు జరుపుకుంటాం. దీంతో పాటు 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటాం. అలాగే విశాఖ సాగర తీరంలో తూర్పు నౌకాదళం ఘనంగా విజయ్ దివస్‌ను నిర్వహించింది.
Bhupendra Patel: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం
Published date : 16 Dec 2022 05:38PM