Andhra Pradesh: పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఏపీకి 5వ స్థానం
పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్.. దేశంలో 5వ స్థానంలో నిలిచింది. 2011–12 నాటి స్థిర ధరల ప్రకారం–ఈ రెండింటి దిగుబడిలో ఏపీ వాటా 5.8% మేర ఉండగా.. 2020–21 నాటికి అది 8.3%కి చేరింది. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రం 7 నుంచి 5వ స్థానానికి ఎగబాకింది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ విషయంలో పశ్చిమబెంగాల్ (11.7%), మధ్యప్రదేశ్ (10. 8%), ఉత్తరప్రదేశ్ (9.7%), మహారాష్ట్ర (9.6%).. ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయల స్థూల విలువ 2011–12లో రూ.16,500 కోట్ల మేర ఉండగా.. 2020–21 నాటికి రూ. 32,900 కోట్లకు చేరింది. లైవ్ స్టాక్ ఉత్పత్తిలోనూ 7.9% వాటాతో నాలుగో స్థానంలో నిలిచింది. మత్స్య ఉత్పత్తుల్లో దేశంలో 40% వాటా సాధించి టాప్‌లో నిలిచింది. ఈ రంగంలో 2015–16 నుంచి రాష్ట్రం ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. పదేళ్లలో మత్స్య ఉత్పత్తిలో రాష్ట్ర వాటా 17.7% నుంచి 40%కి ఎగబాకింది. అరటి ఉత్పత్తిలోనూ 2014–15 నుంచి ఏపీ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. జాతీయస్థాయిలో మొత్తం స్థూల అదనపు విలువలో(జీవీఏ) వ్యవసాయం, అటవీ, మత్స్య ఉత్పత్తుల వాటా 2011–12లో 18.5% మేర ఉండగా, 2020–21 నాటికి అది 20.3శాతానికి పెరిగింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP