Skip to main content

Money Laundering: ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసిన ఈడీ

దేశంలో అక్రమ నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గత ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసింది.
Enforcement Directorate

వీరిలో పలు కార్పొరేట్‌ సంస్థల డైరెక్టర్లున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఏప్రిల్ 3న‌ లోక్‌సభకు ఈ మేరకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ‘కార్పొరేట్‌ మోసాలకు సంబంధించి స్టెర్లింగ్‌ బయోటెక్‌ గ్రూప్, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ తదితరులపై ఈడీ కేసులు పెట్టింది. రూ.33,862.20 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. వీటిలో రూ.15,113 కోట్ల ఆస్తులను ప్రభుత్వ బ్యాంకులు ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈడీ అప్పగించిన ఆస్తులను ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టీయం విక్రయించి రూ.7,975.27 కోట్లు ఆర్జించింది’ అని మంత్రి వివరించారు.

EPFO: పీఎఫ్‌(PF) వడ్డీరేటు పెంచిన కేంద్రం.. ఎంత శాతం పెంచిందంటే?

 

Published date : 04 Apr 2023 06:35PM

Photo Stories