Army Jawans: రోడ్డు ప్రమాదంలో 16 మంది భారత జవాన్ల దుర్మరణం
Sakshi Education
డిసెంబర్ 23న(శుక్రవారం) ఉత్తర సిక్కిం జెమా వద్ద జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడడంతో 16 మంది దుర్మరణం చెందారు.
![](/sites/default/files/images/2022/12/23/sikkim-1671796059.jpg)
మృతుల్లో 13 మంది జవాన్లు, ముగ్గురు అధికారులు ఉన్నారు. మరో నలుగురు గాయపడ్డారు. ట్రక్కులో 20 మంది జవాన్లు, జూనియర్ కమిషన్ అధికారులున్నారు. భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో చాటేన్ నుంచి తంగూ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు మలుపు తీసుకునే సమయంలో వాహనం వెనక్కి ఒరిగి లోయలో పడిపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి జవాన్లు అందించిన సేవలు మరువలేనివని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (11-17 నవంబర్ 2022)
Published date : 23 Dec 2022 05:17PM