Skip to main content

United Nations: ఐరాస అంచనాల ప్రకారం... ఏడాదికి 560 విపత్తులు సంభవించనున్నాయి?

Climate Change

పర్యావరణంపై మనిషి అకృత్యాలు మితిమీరిపోతున్నాయని, ఇలాగే కొనసాగితే ప్రకృతి విలయతాండవాన్ని చవిచూడాల్సివస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. ప్రస్తుత ధోరణులే కొనసాగితే 2030 నుంచి ఏడాదికి 560 విపత్తులను మానవాళి చవిచూడాల్సి వస్తుందని తెలిపింది. ఈ మేరకు తాజగా ఒక నివేదికను విడుదల చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా..

GK Persons Quiz: రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులైనది?

ఒకటిన్నర విపత్తు..

  • 2015లో అత్యధికంగా 400 విపత్తులు ఎదురైతేనే మనిషి అల్లకల్లోలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఏడాదికి 560 అంటే రోజుకు దాదాపు ఒకటిన్నర విపత్తు ఏదోరూపంలో మనిషిని ఇబ్బందిపెట్టనుంది.
  • వరదలు, తుపానులు, భూకంపాలు, కొత్త వ్యాధులు, రసాయన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు.. ఇలా అనేక రూపాల్లో ఇవి ఎదురవుతాయి.
  • 1970– 2000 సంవత్సరం వరకు ప్రపంచంలో ఏదోఒక చోట ఏడాదికి 90– 100 వరకు విపత్తులు వచ్చేవి, కానీ పర్యావరణ విధ్వంసం వేగవంతం కావడంతో విపత్తుల వేగం కూడా పెరిగింది.

మూడురెట్ల వేడి..

  • 2030లో ప్రపంచాన్ని వేడిగాలులు చుట్టుముడతాయి. వీటి తీవ్రత 2001 కన్నా మూడురెట్లు అధికంగా ఉంటుంది. అదేవిధంగా కరువులు 30 శాతం మేర పెరుగుతాయి.
  • కేవలం ప్రకృతి విధ్వంసాలు మాత్రమే కాకుండా ఆర్థిక మాంద్యాలు, వ్యాధులు, ఆహారకొరత వంటివి కూడా శీతోష్ణస్థితి మార్పుతో సంభవిస్తాయి.
  • 1990ల్లో విపత్తుల కారణంగా సంవత్సరానికి దాదాపు 7వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది, ఇప్పుడీ నష్టం 17వేల కోట్ల డాలర్లకు పెరిగింది.
  • విపత్తుల ప్రభావం ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉంటుంది. 
  • ప్రదేశాలవారీగా ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో విపత్తుల వల్ల ఏడాదికి జీడీపీలో 1.6 శాతం మేర నష్టపోతుంది.

​​​​​​​​​​​​​​​​​​Military Budget: రక్షణ వ్యయంలో రెండో స్థానంలో ఉన్న దేశం ఏది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2030 నుంచి ఏడాదికి 560 విపత్తులను మానవాళి చవిచూడాల్సి వస్తుంది
ఎప్పుడు : ఏప్రిల్‌ 26
ఎవరు    : ఐక్యరాజ్యసమితి 
ఎందుకు : పర్యావరణంపై మనిషి అకృత్యాలు మితిమీరిపోతున్నందు వల్ల..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 27 Apr 2022 11:59AM

Photo Stories