UN Secretary General: ప్రకృతి పరిరక్షణలో సహకరించుకోకపోతే వినాశనమే
Sakshi Education
పర్యావరణంలో ప్రతికూల మార్పులను నివారించేందుకు అన్ని దేశాలు తక్షణం ఏకమవ్వాల్సిన ఆవశ్యకతను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నొక్కి చెప్పారు.
పరస్పర సహకారంతో ముందుకుసాగకపోతే వినాశనం తప్పదని ఆయన హెచ్చరించారు. సంపన్న దేశాల్లో 2030 కల్లా, ఇతర దేశాల్లో 2040 కల్లా బొగ్గు వినియోగం నిలిచిపోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్‌ఛేంజ్(యుఎన్ ఎఫ్‌సీసీసీ)’ పేరుతో ఐరాస ఓ వేదికను ఏర్పాటుచేసింది. ఇందులో భాగస్వామ్యమైన సుమారు 200 దేశాల వార్షిక సమావేశాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్(కాప్)గా పిలుస్తున్నారు. తొలి సదస్సు 1995లో బెర్లిన్ లో జరగ్గా.. నిరుడు కాప్ 26ను యూకేలోని గ్లాస్గోలో నిర్వహించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 18 Nov 2022 07:21PM