Skip to main content

World Happiness Report 2023: వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్టు 2023

World Happiness Report 2023

ప్రపంచంలో సంతోషకర దేశాల జాబితాలో భారత్‌ 125వ స్థానంలో నిలిచింది. 150 దేశాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్టు’ పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. జీడీపీ పర్‌క్యాపిటా, సామాజిక మద్దతు, ఆరోగ్యకర జీవన కాలపు అంచనా, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని తయారుచేసిన ఈ జాబితాను ఇంటర్నేషనల్‌ హ్యాపీనెస్‌ డే విడుదల చేసింది. ఈ జాబితాలో ఫిన్‌ ల్యాండ్‌ వరుసగా ఆరోసారి మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో డెన్మార్క్, మూడోస్థానంలో ఐస్‌ల్యాండ్‌ నిలిచాయి. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ర్యాంకుల్లో రష్యా, ఉక్రెయిన్‌ దిగజారినా.. రష్యా 72, ఉక్రెయిన్‌ 92వ స్థానంలో నిలిచాయి.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 01 Apr 2023 05:42PM

Photo Stories