Russia-Ukraine War: రక్తపాతానికి వారిదే బాధ్యత: రష్యా అధ్యక్షుడు పుతిన్
ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించాడు. యుద్దంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే ఉద్ధేశ్యం రష్యాకు లేదన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాలని అన్నారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులకు రక్షణకు మిలటరీ ఆపరేషన్ మొదలైనట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చవద్దనేది తమ డిమాండ్ అని పేర్కొన్నారు. అయితే తమ డిమాండ్‌ను అమెరికా, మిత్ర దేశాలు విస్మరించాయని అన్నారు.
ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలి: పుతిన్
ఇక ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఖర్కిన్, ఒడేస్సా, మరియూపోల్‌లో మిస్సైల్స్‌తో దాడి చేస్తోంది. రష్యా స్వతంత్ర దేశంగా గుర్తించిన డోన్‌బాస్‌లోకి రష్యా సేనలు చేరుకున్నాయి. దీంతో డోన్‌బాస్‌లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్ ఆదేశించారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. ఉక్రెయిన్ వేర్పాటువాదులు లొంగిపోవాలని పుతిన్ హెచ్చరించారు.
రష్యా దాడులను తిప్పికొడతాం: ఉక్రెయిన్
ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 3 వైపులా బలగాలను రష్యా మోహరించింది. ఉక్రెయిన్ సరిహద్దులకు యుద్ధ ట్యాంక్‌లను తరలించింది. ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది. అయితే రష్యా దాడులను తిప్పికొడతామని హెచ్చరించింది. యుద్ధంలో రష్యాపై విజయం సాధిస్తామని పేర్కొంది.
Ukraine-Russia Crisis: రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం మనపై ఎంత?