Skip to main content

United States: మానవీయ సాయానికి అఫ్గాన్‌ కేంద్ర బ్యాంకు నిధులు

Dollars

అమెరికాలో స్తంభించిన అఫ్గానిస్తాన్‌ కేంద్ర బ్యాంకు నిధులను(దాదాపు 700 కోట్ల డాలర్లు)... అఫ్గాన్‌లో మానవీయ సాయానికి, ఉగ్రవాద బాధితులకు పరిహారానికి వినియోగించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఆదేశాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో త్వరలో అధ్యక్షుడు బ్యాంకులకు ఆదేశాలిస్తారని, దీంతో యూఎస్‌ ఫైనాన్స్‌ సంస్థలు ఈ నిధులను విడుదల చేస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. వీటిలో 350 కోట్ల డాలర్లను అఫ్గాన్‌లో సహాయానికి కేటాయిస్తారని, 350 కోట్ల డాలర్లను అమెరికా వద్దే ఉంచుకొని ఉగ్రవాద దాడుల బాధితులకు అందిస్తారని చెప్పారు.

మరో 200 కోట్ల డాలర్లు..

గతంలో అమెరికా సహా పలు దేశాలు అఫ్గాన్‌కు సాయం కోసం కోట్లాది డాలర్ల నిధులను అందించాయి. వీటిని అఫ్గాన్‌ కేంద్రబ్యాంకు అమెరికా బ్యాంకుల్లో దాచింది. తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్నప్పటినుంచి ఈ నిధులు తమకు అప్పగించాలని కోరుతున్నారు. అయితే తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఈ నిధులను అమెరికా స్తంభింపజేసింది. అమెరికాలో ఉన్న 700 కోట్ల డాలర్లు కాకుండా మరో 200 కోట్ల డాలర్ల అఫ్గాన్‌ నిధులు జర్మనీ, యూఏఈ, స్విట్జర్లాండ్, ఖతార్‌లో ఉన్నాయి. అమెరికా తాజా నిర్ణయాన్ని తాలిబన్లు వ్యతిరేకిస్తారని అంచనా.

చ‌ద‌వండి: బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా ఎవరు పదవీ స్వీకారం చేయనున్నారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Feb 2022 05:24PM

Photo Stories