Skip to main content

Military Coup: బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా ఎవరు పదవీ స్వీకారం చేయనున్నారు?

Burkina Faso Military

పశ్చిమాఫ్రికా దేశం బుర్కినాఫాసో దేశ కొత్త అధ్యక్షుడిగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ పాల్‌ హెన్నీ సాండోగో డామిబా ప్రకటించుకున్నారు. ఇటీవలే ఈ దేశంలో ఆర్మీ తిరుగుబాటు జరిపిన సంగతి తెలిసిందే. తిరుగుబాటు సైనిక జుంటాకు పాల్‌ అధిపతిగా ఉన్నారు. తాజాగా దేశాధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారని రాజ్యాంగ సమాఖ్య ప్రకటించింది. ఫిబ్రవరి 16న పాల్‌ అధికారికంగా పదవీ స్వీకారం చేస్తారు. ప్రస్తుతానికి జుంటాకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.

క్రిస్టియన్‌ కబోరెను బంధించి..

పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్‌ మార్క్‌ క్రిస్టియన్‌ కబోరెను బంధించామని ఆ దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు 2022, జనవరి 24న ప్రకటించారు. జనవరి 23న సైనిక శిబిరాల వద్ద మొదలైన కాల్పుల కలకలం జనవరి 24న కూడా కొనసాగింది. అధ్యక్ష భవనం వద్ద చిన్నపాటి యుద్దం జరిగింది. రాజధానిలో తిరుగబాటు సైనికులు గస్తీ కాస్తున్నారు. తొలుత ఇది తిరుగుబాటు కాదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ చివరకు సైనికుల చేతికి ప్రెసిడెంటే బందీగా చిక్కారు.

2015 నుంచి..

2015 నుంచి బుర్కినాకు కబోరె అధిపతిగా ఉన్నారు. దేశంలో జరుగుతున్న ఉగ్రచర్యలతో మిలటరీ తీవ్రంగా నష్టపోతోంది. తమకు సరైన సదుపాయాలు లేవని సైనికులు అసంతృప్తిగా ఉన్నారు. ఇది చివరకు తిరుగుబాటకు దారితీసింది. తిరుగుబాటుకు ప్రజల్లో కూడా మద్దతు ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు తెలిపారు.

బుర్కినా ఫాసో..
రాజధాని:
ఔగాడౌగౌ; కరెన్సీ: వెస్ట్‌ ఆఫ్రికన్‌ సీఎఫ్‌ఏ ఫ్రాంక్‌
అధికార భాష: ఫ్రెంచ్‌

చ‌ద‌వండి: నాలుగో క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా ఎవరు పదవీ స్వీకారం చేయనున్నారు?
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు    : బుర్కినా ఫాసో మిలటరీ అధిపతి, లెఫ్టినెంట్‌ కల్నల్‌ పాల్‌ హెన్నీ సాండోగో డామిబా 
ఎందుకు : సైన్యం తిరుగుబాటు నేపథ్యంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Feb 2022 01:16PM

Photo Stories