Skip to main content

H-1B Visa: ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్‌... హెచ్‌-1బీ వీసా జారీలో తొల‌గ‌నున్న ఇబ్బందులు...!

ప్రధాని న‌రేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐలకు శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. యూఎస్‌లో పనిచేస్తోన్న భారతీయులకు హెచ్‌-1బీ వీసాల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు బైడెన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్‌... హెచ్‌-1బీ వీసా జారీలో తొల‌గ‌నున్న ఇబ్బందులు...!
ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్‌... హెచ్‌-1బీ వీసా జారీలో తొల‌గ‌నున్న ఇబ్బందులు...!

హెచ్‌-1బీ వీసా పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించేలా బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. దీంతో స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్‌ఆర్‌ఐలు తమ వీసాలను రెన్యువల్‌ చేసుకునేలా ఒక పైలట్‌ ప్రొగ్రామ్‌ను ప్రకటించనున్నట్లు స‌మాచారం. ప్రస్తుతం కొంత‌మందికి మాత్రమే అవకాశం కల్పించి, ఆ ఫ‌లితాల‌ను విశ్లేషించిన‌ తర్వాత ఈ కార్య‌క్ర‌మాన్ని విస్తరించనున్నారు.

15 ఏళ్ల‌కే తండ్రిని కోల్పోయి... సైకిల్ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించి... 23 ఏళ్ల‌కే ఐఏఎస్ సాధించిన వరుణ్ భరన్వాల్ స‌క్సెస్ స్టోరీ

Modi Biden

అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు హెచ్‌-1బీ వీసా అవకాశం కల్పిస్తుంది. ఈ రకం వీసా వినియోగదారుల్లో మెజార్టీ వాటా భారతీయులదే. 2022 ఆర్థిక సంవత్సరంలో 4,42,000 మంది H-1B వీసా వినియోగదారుల్లో 73 శాతం మంది భారతీయులే ఉన్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. వీసా స్టాంపింగ్‌ కోసం ఆయా దేశాల్లోని అమెరికన్‌ కాన్సులేట్‌/ఎంబసీల్లో దరఖాస్తు చేసుకోవాలి. హెచ్‌-1బీ వీసా పునరుద్ధరణకు, కొత్తగా పొందడానికి ఇంటర్వ్యూ కోసం ప్రస్తుతం సుదీర్ఘ కాలం వెయిటింగ్‌ ఉంటోంది. 

NEET 2023 Ranker Success Story : కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. నీట్ ర్యాంకు సాధించిన విభూ ఉపాధ్యాయ

h 1b visa

అత్యవసర పరిస్థితుల్లోనూ స్వదేశానికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉందని.. ఆయా దేశాల్లో వీసా అపాయింట్‌మెంట్‌లో చోటుచేసుకుంటున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విష‌యాన్ని భార‌త ప్ర‌భుత్వం అమెరికా ద‌`ష్టికి తీసుకెళ్లింది. దీంతో పాత విధానంలో ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను తొలిగించేలా నూత‌న ప్రోగ్రాంను చేప‌ట్టే అవ‌కాశం పుష్క‌లంగా క‌నిపిస్తోంది.

Published date : 22 Jun 2023 04:12PM

Photo Stories