United Nations: ప్రపంచవ్యాప్తంగా ఏటా వృథా అవుతున్న ఆహారం విలువ?
ఆహారం వృథాలో రెండు భిన్నకోణాలు ఉన్నాయి. పంటలు పండించడం నుంచి రవాణా, మార్కెటింగ్, విక్రయం వరకు ఉన్న దశల్లో అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో వృథా ఎక్కువగా ఉంటోంది. పంటలు పండించడం, నిల్వ వంటి సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని ఐక్యరాజ్యసమితి తమ నివేదికలో పేర్కొంది.
Russia-Ukraine War: రష్యాలో ఏటా ‘విక్టరీ డే’ని ఎప్పుడు జరుపుకుంటారు?
- వండిన, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం విషయంలో అభివృద్ధి చెందిన, ధనిక దేశాల్లో వృథా చాలా ఎక్కువ. అలాంటి దేశాల్లో కేవలం ఇళ్లలోనే 30 శాతానికిపైగా ఆహారం వృథా అవుతున్నట్టు యూఎన్ నివేదిక తెలిపింది. తమ సంపాదనలో ఆహారానికి అయ్యే ఖర్చు తక్కువగానే ఉండటం, ఆహారాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేయడం, అవసరానికి మించి కొనుగోలు వంటివి దీనికి కారణమని పేర్కొంది.
- యూరప్, ఉత్తర అమెరికా ఖండాల్లోని దేశాల్లో సగటున ఒక్కోవ్యక్తి ఏటా 100 కిలోల ఆహారాన్ని వృథా చేస్తారని అంచనా. ఇది ఆఫ్రికా, దక్షిణాసియాతో పోలిస్తే పదింతలు ఎక్కువ.
- భూమ్మీద ఏటా ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయల్లో దాదాపు సగం మేర ఏదో ఓ రూపంలో వృథా అవుతూనే ఉన్నాయి.
- మనుషులు తినేందుకు వీలుగా తయారు చేసిన/వండిన ఆహారంలో దాదాపు మూడో వంతు వరకు.. కిందపడిపోవడం/చెడిపోవడం/పడేయడం ద్వారా వృథా అవుతోంది. వృథా అవుతున్న ఆహారం ఏటా సుమారు 1,300 టన్నులు ఉంటుందని అంచనా.
- ఏటా ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారంలో పావు వంతు వినియోగించుకోగలిగినా.. 87 కోట్ల మంది ఆకలి తీర్చవచ్చట.
కోట్ల కిలోమీటర్ల మేర వృథా..
- ఏటా భారీగా ఆహారం వృథా అవుతోంది కదా. మరి దానంతటినీ ఉత్పత్తి చేయడానికి వాడుతున్న భూమి విస్తీర్ణం ఎంతో తెలుసా?.. ఏకంగా 1.35 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న వ్యవసాయ భూమిలో 28శాతం. మరోలా చెప్పాలంటే.. ఇండియా, అమెరికా, ఈజిప్ట్ దేశాల్లోని మొత్తం భూమి విస్తీర్ణంతో సమానమైన వ్యవసాయ భూమిలో ఉత్పత్తయ్యే ఆహారం వృధా అవుతోంది.
- ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా వృథా అవుతున్న ఆహారం విలువ సుమారు లక్ష కోట్ల డాలర్లు. భారతీయ కరెన్సీలో చూస్తే.. రూ. 75 లక్షల కోట్లు.
ఆహార వృథాలో మొదటి పది దేశాలు |
|
దేశం |
ఆహార వృథా(ఏటా.. టన్నుల్లో) |
చైనా |
9,16,46,213 |
ఇండియా |
6,87,60,163 |
యూఎస్‌ఏ |
1,93,59,951 |
జపాన్ |
81,59,891 |
జర్మనీ |
62,63,775 |
ఫ్రాన్స్ |
55,22,358 |
యూకే |
51,99,825 |
రష్యా |
48,68,564 |
స్పెయిన్ |
36,13,954 |
ఆస్ట్రేలియా |
25,63,110 |
Economic Crisis in Sri Lanka: విదేశీ రుణాల చెల్లింపులను నిలిపివేసిన దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్