Skip to main content

UK minister Suella Braverman fired: బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా మంత్రివర్గం నుంచి తొలగింపు

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సోమవారం తన మంత్రివర్గంలో ఆకస్మిక మార్పుచేర్పులు చేశారు.
UK minister Suella Braverman was fired from the Cabinet

కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత మూలాలున్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ను విదేశాంగ మంత్రిగా నియమిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటిదాకా విదేశాంగ మంత్రిగా ఉన్న జేమ్స్‌ క్లెవర్లీని బ్రేవర్మన్‌ స్థానంలో హోం మంత్రిగా నియమించారు.

US INDIA Chamber of Commerce: టెక్సాక్‌లో గ్రాండ్‌గా యూఎస్‌ ఇండియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్‌

ప్రధాని సిఫార్సుల మేరకు వారిద్దరి నియామకాలకు రాజు చార్లెస్‌ ఆమోదముద్ర వేసినట్టు డౌనింగ్‌ స్ట్రీట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు హౌజింగ్‌ మంత్రి రేచల్‌ మెక్లీన్‌ను కూడా సునాక్‌ పదవి నుంచి తప్పించారు.ఈ నేపథ్యంలో మరో ఆరుగురు జూనియర్‌ మంత్రులు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు! థెరెసా కోఫీ, నిక్‌ గిబ్, నీల్‌ ఓబ్రియాన్, విల్‌ క్విన్స్, జెస్సీ నార్మన్‌ ఈ జాబితాలో ఉన్నారు.

Russia Withdrawal from CTBT: సీటీబీటీ నుంచి వైదొలగిన రష్యా

Published date : 14 Nov 2023 03:40PM

Photo Stories