High Value Currencies: ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఇదే.. టాప్ 10 కరెన్సీలు ఇవే..
అత్యంత విలువైన కరెన్సీ అనగానే యూఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో వంటివి మన మదిలో మెదులుతాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ విలువ రూ.270.23కు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోందని తెలిసింది. కాగా అమెరికా డాలర్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ డాలర్లలో అత్యంత విస్తృతంగా వాణిజ్యం జరుగుతోంది.
విలువైన కరెన్సీలు.. రూపాయిల్లో..
1. కువైట్ దినార్: రూ.270.23
2. బహ్రెయిన్ దినార్: రూ.220.4
3. ఒమానీ రియాల్: రూ.215.84
4. జోర్డానియన్ దినార్: రూ.117.10
5. జిబ్రాల్టర్ పౌండ్: రూ.105.52
6. బ్రిటిష్ పౌండ్: రూ.105.54
7. కేమ్యాన్ ఐలాండ్ పౌండ్: రూ.99.76
8. స్విస్ ఫ్రాంక్: రూ.97.54
9. యూరో: రూ.90.80
10. యూఎస్ డాలర్: రూ.83.10
Best Food Cities: ఉత్తమ ఆహార జాబితాలో చోటు దక్కించుకున్న 5 భారతదేశ నగరాలు, టాప్ 10 నగరాలివే..!