Thwaites Glacier: ప్రమాద గంటికలను మోగిస్తున్న థ్వాయిట్స్ హిమానీనదం
Sakshi Education
థ్వాయిట్స్ హిమానీనదం.. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్.. కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోంది. ఎంతలా అంటే ఇప్పుడది మునివేళ్లపై నిల్చొని ఉందని చెప్పవచ్చు. అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్‌కు ప్రళయకాల హిమానీనదం(డూమ్స్ డే గ్లేసియర్) అని మరోపేరు పెట్టారు. ఈ గ్లేసియర్‌తోపాటు సమీప ప్రాంతాల్లోని మంచు మొత్తం కరిగిపోతే.. ప్రపంచమంతటా సముద్ర మట్టం ఏకంగా 3 మీటర్ల మేర పెరిగి.. తీర ప్రాంతాలు చాలావరకు నీట మునిగి నామరూపాల్లేకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 23 Sep 2022 05:09PM