Skip to main content

Nitrous Oxide : ప్రమాదకరంగా నైట్రస్‌ ఆక్సైడ్‌ పెరుగుదల

1980–2020 మధ్య వాతావరణంలో భూతాపాన్ని పెంచే నైట్రస్‌ ఆక్సైడ్‌ (ఎన్‌2ఓ) ఉద్గారాల పెరుగుదల 40 శాతం ఉండటం ఆందోళన కలిగించే విషయమని తాజా నివేదిక వెల్లడించింది.
nitrous oxide emissions from 1980 to 2020  There is a dangerous growth in Nitrous Oxide  Global warming impact

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఈ ఉద్గారాల పెంపులో చైనా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత భారత్, అమెరికా దేశాలు ఉన్నట్టు వాతావరణ శాస్త్రజ్ఞుల బృందంతో కూడిన గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్టు తెలుపుతోంది. ఇటీవల చేపట్టిన ఈ పరిశోధనల ప్రకారం– 74 శాతం నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు మనం వినియోగించే నత్రజని ఎరువులు, వ్యవసాయంలో వాడే జంతువుల ఎరువుల నుంచే విడుదలవుతున్నాయని వీరు వెల్లడించారు.

Economy Development : ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా భారత్‌..

ఎక్కువగా ఉద్గారాలు విడుదల చేసే మొదటి 10 దేశాల్లో చైనా, భారత్, అమెరికా, బ్రెజిల్, రష్యా, పాకిస్థాన్‌ , ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, కెనడా ఉన్నాయి. గ్రీన్‌ హౌస్‌ గ్యాస్‌ల విడుదలలో కార్బన్‌ డయాక్సైడ్, మీథేన్‌ తర్వాత నైట్రస్‌ ఆక్సైడ్‌ మూడో స్థానంలో ఉందని పరిశోధకులు తెలిపారు. ఇప్పటికే ఈ గ్రీన్‌ హౌస్‌గ్యాస్‌ల కారణంగా భూతాపం 1850–1900లతో పోలిస్తే 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగింది. వ్యవసాయ వ్యర్థాల నుంచి వచ్చే ఉద్గారాలు 2020లో 8 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా నమోదయ్యాయి. 1980లో ఉన్న 4.8 మిలియన్‌ టన్నులతో పోలిస్తే.. 67 శాతం అధికమని ఎర్త్‌ సిస్టమ్‌ సైన్స్‌ జర్నల్‌ ప్రచురించిన డేటాలో వెల్లడించింది. 

G7 Summit: ఈ దేశానికి రుణ ప్యాకేజీని ప్రకటించిన జీ7 దేశాల కూటమి!

Published date : 18 Jun 2024 01:21PM

Photo Stories