Skip to main content

Same Sex Marriage: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ఇచ్చిన తొలి దేశం ఇదే.. జనవరి నుంచి అమల్లోకి..

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్‌లాండ్‌ నిర్ణయించింది
Historic moment as Thailand becomes first Southeast Asian country to recognize same-sex marriage  Thailand Becomes First South East Asian Nation To Recognise Same Sex Marriage

ఇందుకు వీలు కల్పించే చరిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయ్‌లాండ్‌ రాజు మహా వజ్రలాంగ్‌కర్ణ్‌ తాజాగా సంతకం చేశారు. దీంతో ఆగ్నేయాసియాలో స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇచ్చిన తొలి దేశంగా థాయ్‌లాండ్‌ నిలిచింది. 

2025 జనవరి 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం వివాహ చట్టంలో భార్య, భర్త వంటి పదాలకు బదులుగా ఇకపై వ్యక్తి, స్త్రీ, పురుషుడు అనే పదాలు వాడతారు. స్వలింగ జంటకు దత్తత, వారసత్వంతో పాటు పూర్తిస్థాయి ఆర్థిక, వైద్య, చట్టపరమైన హక్కులు లభిస్తాయి. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే స్వలింగ సంపర్కు (ఎల్జీబీటీక్యూ)లకు థాయ్‌లాండ్‌లో మొదటినుంచీ స్వేచ్ఛ ఎక్కువే. అయితే పూర్తిస్థాయి హక్కుల కోసం వాళ్లు 20 ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. 

సంబంధిత బిల్లు జూన్‌లో సెనేట్‌ ఆమోదం పొందింది. రాజు ఆమోదంతో సెప్టెంబ‌ర్ 24వ తేదీ చట్టరూపు దాల్చింది. ఇది చరిత్రాత్మకమంటూ ఎల్జీబీటీక్యూ ఉద్యమకారులు ప్రశంసించారు. 

Best Countries Ranking: ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ దేశాలు ఇవే..

‘చరిత్రలో చెరిగిపోని ఒక పేజీని లిఖించుకున్నాం. సమానత్వానికి, మానవ గౌరవానికి దక్కిన విజయమిది’ అని ఎల్జీబీటిక్యూ హక్కుల కోసం దీర్ఘకాలంగా పని చేస్తున్న చుమాపోన్‌ అన్నారు. చట్టం అమల్లోకి రానున్న జనవరి 22న 1,000కి పైగా ఎల్జీబీటీక్యూ జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించే యోచన ఉన్నట్టు ఆమె తెలిపారు.

ఆసియాలో మూడో దేశం..
తైవాన్, నేపాల్‌ తర్వాత ఆసియాలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన మూడో దేశంగా థాయ్‌లాండ్‌ నిలిచింది. తైవాన్‌ 2019లో తొలిసారి ఈ చర్య తీసుకుంది. అనంతరం నేపాల్‌ సుప్రీంకోర్టు కూడా ఎల్జీబీటీక్యూ బంధాల చట్టబద్ధతకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

Retirement Age: రిటైర్మెంట్‌ వయసు పెంపు.. జనవరి నుంచి అమల్లోకి.. ఎన్నేళ్లంటే..!

Published date : 26 Sep 2024 12:36PM

Photo Stories