Skip to main content

Russia-Ukraine War: అమెరికా, ఈయూ మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పంద ఉద్దేశం?

GAS-Russia
రష్యా గ్యాస్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. గ్యాస్‌ సరఫరా కోసం రష్యాపై ఆధారపడకూడదని యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ మధ్య మార్చి 24న కీలక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. యూరప్‌ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈయూ ఉన్నతాధికారులతో కలిసి ఒప్పంద వివరాలను వెల్లడించారు. బెల్జియం రాజధాని నగరం బ్రసెల్స్‌ వేదికగా ఈ ఒప్పందం కుదిరింది. యూరప్‌ తన గ్యాస్‌ అవసరాల్లో దాదాపుగా 40 శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

Girls Education: బాలికా విద్యపై ఏ దేశంలో ఆంక్షలు విధించారు?

ఒప్పందం ప్రకారం..

  • యూరప్‌ దేశాల ఇంధన, ముఖ్యంగా గ్యాస్‌ అవసరాలను చాలావరకు అమెరికా, ఇతర దేశాలు తీరుస్తాయి. 
  • యూరప్‌కు అమెరికా, ఇతర దేశాలు వార్షిక గ్యాస్‌ ఎగుమతులను మరో 15 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మేరకు పెంచాలి. దీన్ని మున్ముందు మరింత పెంచుతారు. 
  • శిలాజ ఇంధనాల వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలి.

Russia-Ukraine War: జీ7, నాటో చర్చలకు ఆథిత్యం ఇస్తోన్న నగరం?

కొత్త ఒప్పందాలు: జర్మనీ
బొగ్గు, గ్యాస్, చమురు కోసం రష్యాపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటామని జర్మనీ ప్రకటించింది. ఇందుకోసం కొత్త సప్లయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ఆ దేశ ఆర్థిక మంత్రి రాబర్ట్‌ హెబెక్‌ వెల్లడించారు. జర్మనీ గ్యాస్‌ అవసరాల్లో 45 శాతానికి పైగా రష్యానే తీరుస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అమెరికాతో కీలక వ్యూహాత్మక ఒప్పందం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు    : యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)
ఎక్కడ    : బ్రసెల్స్, బెల్జియం
ఎందుకు  : యూరప్‌ దేశాల ఇంధన, ముఖ్యంగా గ్యాస్‌ అవసరాలను చాలావరకు అమెరికా తీర్చేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Mar 2022 05:05PM

Photo Stories