Russian Journalists: వేలానికి పెట్టిన నోబెల్ శాంతి బహుమతి
ఉక్రెయిన్ బాల శరణార్థుల సంక్షేమం కోసం రష్యా జర్నలిస్ట్ దిమిత్రీ మురటోవ్ వేలానికి పెట్టిన నోబెల్ శాంతి బహుమతి చరిత్ర సృష్టించింది. గత రికార్డులను బద్దలు కొట్టి ఏకంగా రూ.800 కోట్లు పైగా ధర పలికింది. కొన్న వ్యక్తి ఎవరనే విషయాన్ని వేలం సంస్థ వెల్లడించలేదు. అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్ ఒకటో తేదీన ప్రారంభమైన వేలం ప్రపంచ శరణార్థుల దినం రోజు జూన్ 20 (సోమవారం)2022న ముగిసింది. జూన్ 20, 2022 ఉదయం వరకు అత్యధిక బిడ్ రూ.4.50 కోట్లలోపే ఉంది. కానీ, అనూహ్యంగా ఒక్కసారిగా పెరిగిందని నిర్వాహకులు అన్నారు. దిమిత్రీ మురటోవ్ చేస్తున్న ప్రయత్నాల పట్ల గత రెండు రోజులుగా ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడిందని చెప్పారు. ‘నా ప్రయత్నానికి మానవతావాదుల మద్దతు లభిస్తుందని భావించానే గానీ, ఇంతటి భారీ స్పందన ఉంటుందని ఊహించలేదు’అని అనంతరం మురటోవ్ అన్నారు. బిడ్డింగ్‌లో పాల్గొన్న ఇతరులు కూడా ఉక్రెయిన్ వలస చిన్నారుల సంక్షేమానికి విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. రష్యా యుద్ధ బాధిత ఉక్రెయిన్ చిన్నారుల సంక్షేమానికి మురటోవ్ ఇప్పటికే రూ.4 కోట్లను అందజేశారు.
Also read: GK International Quiz: ఏకకాలంలో 78,220 జాతీయ జెండాలను రెపరెపలాడించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన దేశం?