Ukraine లోని 4 ప్రాంతాలు Russiaలో విలీనం
ఈ రెఫరెండంలో దక్షిణ, తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలైన జపొరిఝియాలో 93%, ఖేర్సన్‌లో 87%, లుహాన్‌స్క్ లో 98%, డొనెట్‌స్క్‌లో 99% మంది రష్యాకు అనుకూలంగా ఓటేశారని క్రెమ్లిన్ అనుకూల పరిపాలనాధికారులు సెప్టెంబర్ 27న ప్రకటించారు. సెప్టెంబర్ 30న క్రెమ్లిన్ కోటలోని సెయింట్ జార్జి హాల్‌లో జరిగే కార్యక్రమంలో విలీనం విషయాన్ని అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటిస్తారని అధికార ప్రతినిధి పెషో్కవ్ చెప్పారు. విలీనానికి సంబంధించిన పత్రంపై ఈ నాలుగు ప్రాంతాల అధికారులు సంతకాలు చేస్తారన్నారు. రష్యా చర్యను ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ ఇతర పశి్చమ దేశాలు ఖండించాయి. రష్యా చేపట్టిన రెఫరెండంను, విలీనం చేసుకోవడాన్ని గుర్తించబోమన్నాయి. ఈ ప్రాంతాలను తిరిగి స్వా«దీనం చేసుకుంటామని ఉక్రెయిన్ ప్రతిజ్ఞ చేసింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లో ద్నీప్రో ప్రాంతంపై రష్యా జరిపిన రాకెట్ దాడిలో చిన్నారి సహా 8 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈశాన్య ప్రాంత లెమాన్ నగరంపై పట్టు కోసం ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర పోరు సాగుతోందని బ్రిటిష్ నిఘా వర్గాలు వెల్లడించాయి.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP