Quad summit 2021: క్వాడ్ సదస్సును ఏ నగరంలో నిర్వహించనున్నారు?
![quad summit 2021](/sites/default/files/images/2021/09/15/quad-summit-2021-1631693526.jpg)
ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లైన అఫ్గాన్ సంక్షోభం, కోవిడ్ మహమ్మారి, స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్ విధానంపై నాలుగు దేశాల కూటమైన (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) క్వాడ్ సదస్సులో చర్చించనున్నారు. సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిడె సుగ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు పాల్గొంటారు. 2021, మార్చిలో ప్రకటించిన క్వాడ్ వ్యాక్సిన్‌పై వీరు సమీక్షించనున్నారు.
ప్రధాని మోదీ వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళుతున్నారు. క్వాడ్ సదస్సు, ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాల్గొనడానికి మోదీ వెళుతున్నట్టుగా సెప్టెంబర్ 14న భారత విదేశాంగ శాఖ తెలిపింది.
చదవండి: 2021 ఏడాది జరిగిన బ్రిక్స్ దేశాల 13వ సదస్సు థీమ్ ఏమిటీ?
సెప్టెంబర్ 25న యూఎన్ సర్వప్రతినిధి సదస్సు...
2021, సెప్టెంబర్ 25న న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమతి సర్వప్రతినిధి సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటుగా 100 దేశాలకు చెందిన అధినేతలు హాజరవుతున్నారు. కోవిడ్–19 సంక్షోభం నుంచి కోలుకుంటామన్న ఆశతో జాతి పునర్నిర్మాణం, సుస్థిరత కొనసాగడం, భూమి అవసరాలకనుగుణంగా మసలు కోవడం, ప్రజల హక్కుల్ని గౌరవించడం, ఐక్యరాజ్య సమితి పునరుజ్జీవనం తదితర అంశాలపై ఈ సదస్సు జరగనుంది. ఈసారి సదస్సులో అఫ్గానిస్తాన్ ప్రతినిధికి చివరి రోజు ప్రసంగించే అవకాశం కల్పించారు. గత ఏడాది(2020) కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్‌గా ఈ సదస్సుని నిర్వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, సెప్టెంబర్ 24న క్వాడ్ (Quadrilateral Security Dialogue-Quad) సదస్సు నిర్వహణ
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : అఫ్గాన్ సంక్షోభం, కోవిడ్ మహమ్మారి, స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్ విధానంపై చర్చలు జరిపేందుకు...