Skip to main content

India–Qatar Relations: భారత్, ఖతార్‌ బంధం సుదృఢం

భారత్, ఖతార్‌ దేశాల బంధం మరింత బలోపేతం అవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు.
PM Modi thanks Qatar Emir for freeing 8 Navy veterans

ఖతర్‌ పర్యటనలో ఉన్న మోదీ ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ ఖతార్‌ ఎమీర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌–థానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయి శిక్షలు పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులకు ఖతార్‌ ప్రభుత్వం విడిచిపెట్టిన నేపథ్యంలో ఖతార్‌ పాలకునితో మోదీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘ ఎమీర్‌ను కలవడం అద్భుతం. ఇరుదేశాల మధ్య భిన్నరంగాల్లో విస్తృతస్తాయి సహకారానికి ఈ భేటీ బాటలు పరుస్తోంది. పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే నూతన రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్, ఖతార్‌ సిద్ధంగా ఉన్నాయి’ అని భేటీ తర్వాత మోదీ ‘ఎక్స్‌’లో ట్వీట్ చేశారు. 

నేవీ అధికారులను విడిచిపెట్టినందుకు థాంక్యూ..
‘ఇరు నేతల చర్చలు ఫలవంతమయ్యాయి. ఖతార్‌లోని భారతీయుల సంక్షేమ బాధ్యతలు తీసుకున్న ఖతార్‌ ఎమీర్‌కు మోదీ ధన్యవాదాలు చెప్పారు. కఠిన శిక్షలు పడిన 8 మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులను వదిలిపెట్టినందుకు ఖతార్‌ ఎమీర్‌కు మోదీ థాంక్యూ చెప్పి మెచ్చుకున్నారు. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆయనను మోదీ ఆహ్వానించారు’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ ఖ్వాత్రా వెల్లడించారు.

India UAE Relations: ఏడాదిలో భారత్ - యూఏఈ బంధం ఎలా బలపడింది..?

Published date : 16 Feb 2024 04:58PM

Photo Stories