India-France: ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో ప్రధాని మోదీ ఎక్కడ సమావేశమయ్యారు?
ఐరోపా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలు సహా అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం గురించి ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ‘భారత్‌కున్న బలమైన అంతర్జాతీయ భాగస్వాముల్లో ఫ్రాన్స్ ఒకటి. విభిన్న రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటున్నాయి’ అని పారిస్ చేరుకున్న వెంటనే మోదీ ట్వీట్ చేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా నిలిపివేయాలి, ఈ సంఘర్షణ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టాన్ని ఎలా నివారించాలి, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవడం ఎలా తదితర అంశాలపై మోదీ, మెక్రాన్ చర్చించుకున్నారు. భారత్–ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలకు 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగానూ మోదీ పర్యటనకు ప్రాధాన్యమేర్పడింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది అయిదోసారి. 2019 ఆగస్టు, 2017 జూన్ , 2015 నవంబరు, 2015 ఏప్రిల్ నెలల్లో మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. రెండు దేశాలు 1998 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు జెపార్డ్ గన్స్ పంపుతామని ప్రకటించిన దేశం?